Pragathi: ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉండే సెలెబ్రిటీల సంఖ్య ఎక్కువగా అవుతోంది. యుక్త వయస్సు నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, అమ్మ, వదిన క్యారెక్టర్లు చేసే నటీమణులు కూడా తమ ఫొటోలను షేర్ చేసుకుంటూ.. అభిమానులకు దగ్గర అవుతున్నారు.

ఇలాంటి వారిలో ఎక్కువగా చెప్పుకునే పేరు ప్రగతి. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. హీరో లేదా హీరోయిన్ తల్లి క్యారెక్టర్ లో ఆమె ఒదిగిపోయి మరీ నటిస్తుంది. ఆమె ఆ పాత్రకు జీవం పోస్తుంది. అయితే ఆమెను ప్రగతి ఆంటీ అంటూ చాలామంది సంబోధిస్తుంటారు.

అయితే ఆమె వయస్సు నాలుగు పదుల వయస్సు మాత్రమే అట. అయితే ఆమె ఇటీవల తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారణం అని ఇప్పటికే చాలామంది వ్యాఖ్యానించారు.
ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చి..
అందులో భాగంగానే ప్రగతి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. అది తన జీవితంలో చేదు అనుభవం అంటూ ఓ ఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆమె సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో కోలీవుడ్ లో ఆమెకు ఆఫర్ వచ్చందట. అది కూడా స్టార్ హీరోతో. కొన్ని రోజుల తర్వాత ఆ బడా హీరో ప్రగతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడట. అతడు చెప్పిన బట్టలు వేసుకోవాలని.. అతని పక్కలో పడుకోవాలని బలవంతం చేశాడట. అలా అయితే చాన్స్ ఇస్తానని లేకుంటే.. నీకు ఈ అవకాశం ఉండదని చెప్పాడట. దానికి ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చి.. సినిమా నుంచి తప్పుకున్నాననే విషయాన్ని తెలిపారు.































