Praja gayakudu Gaddar : గద్దర్ శరీరంలో బుల్లెట్… అసలు గద్దర్ మీద కాల్పులు జరిపింది ఎవరు…!

0
91

Praja Gayakudu Gaddar : తెలంగాణ ఉద్యమగళం మూగబోయింది. ఆశుగా పాటలను పాడి ప్రజలలో చైతన్యం నింపిన గద్దర్ ఇక లేరు. ఎంతో మందిని తన గళంతో ఉత్తేజపరిచి గ్రామాలలో గిరిజనుల మీద జరుగుతున్న అకృత్యాలను చెబుతూ గిరిజన, స్త్రీ లకోసం పోరాడిన ఉద్యమకారుడు తెలంగాణ తొలి మరియు మలి ఉద్యమాలలో తన గళంతో చైతన్యం నింపిన గద్దర్ జులై 20వ తేదీన గుండెపోటుతో అపోలో హాస్పిటల్ లో చేరగా బైపాస్ సర్జరీ జరిగింది. అయితే ఆపరేషన్ తరువాత ఊపిరి తిత్తులు, యూరినరీ సమస్యలతో ఆగష్టు 6న మరణించారు. అయితే మరణించే సమయం వరకు కూడా ఆయన శరీరంలో ఒక బుల్లెట్ తో సహజీవనం చేసారు గద్దర్.

గద్దర్ మీద కాల్పులు జరిపింది ఎవరు…

1990 ముందు వరకు నిషేధం విధించడం వల్ల మహారాష్ట్ర లో తలదాచుకున్న గద్దర్ చెన్నా రెడ్డి ప్రభుత్వ హయాంలో నక్సల్ సానుభూతి పరుల మీద కొంత సానుకూలత వ్యక్తం చేయడం, నిషేధం ఎత్తివేయడంతో మళ్ళీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టారు. నిజామ్ గ్రౌండ్స్ లో అయన సభకు లక్షల మంది హాజరయ్యారు. అలాంటి ప్రజా గాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు 1997లో కాల్పులు జరుపగా శరీరంలోకి ఐదు బుల్లెట్లు దిగాయి. చనిపోయాడని భావించినా ఆయన బ్రతికారు.

హాస్పిటల్ లో చికిత్స అందించి నాలుగు బుల్లెట్లను తొలగించినా ఒక బుల్లెట్ తీస్తే ప్రాణానికి ప్రమాదం అని చెప్పడంతో ఆ బుల్లెట్ ను తన శరీరంలో ఉంచేసారు. మొదట్లో ఆ బుల్లెట్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా వయసు పెరిగే కొద్ది నొప్పి తీవ్రమై హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1997లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పుల మీద విచారణ జారపాలని నిర్ణయం తీసుకున్నా అది నత్తనడకన సాగింది. ఇక రాజశేఖర్ రెడ్డి హయాంలో కేసులో ఎటువంటి పురోగతి లేదని పోలీసులు విచారణ ఆపేసి కేసు కొట్టేసారు.