‘మా’ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మరింత హీటెక్కింది. ఎప్పుడు.. ఎవరు ఏ సమయంలో ఎలా మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మంచు విష్ణు చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన ప్రకాష్ రాజ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై మండిపడ్డారు.

ఈ మీట్ లో సినీ, టీవీ నటుడు ప్రభాకర్ కూడా ఉన్నారు. అతడు మాట్లాడుతూ.. తన దృష్టిలో ప్రకాష్ రాజ్ ఎప్పుడో గెలిచారని చెప్పారు. మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో బెనర్జీ కళ్లల్లో నీళ్లు చూసినప్పుడు నాకు రక్తం మరిగిపోయిందన్నారు. అవతల తనకు తండ్రి లాంటి వ్యక్తిని ఏం చేయగలను అంటూ.. సినీ పరిశ్రమలో ఎదురు మాట్లాడితే తొక్కేస్తారు అని.. 20 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని..అన్నారు.
కొండను ఢీ కొట్టడం అంత ఈజీ కాదు. అందుకే వదిలేశాం. కాంప్రమైజ్ అయ్యాం. అని ప్రభాకర్ అన్నారు. బెనర్జీని అన్న మాటలు తనను అని ఉంటే.. ఊరుకునే వాడిని కాదని అన్నాడు. మంచు విష్ణు తనపై వేలు చూపించి అరిచాడని.. గొడవలు వద్దనే కారణంతో తాము ఊరుకున్నామని.. అన్నారు.
మోహన్ బాబు మాట్లాడే తీరు.. అతడు తిట్టే బూతులు తన జీవితంలో వినలేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మా ఎన్నికలో అధ్యక్షుడిగా పోటీచేసింది విష్ణు కాదు అని.. మోహన్ బాబు అని.. అలా తనకు అనిపించిందని ప్రభాకర్ అన్నారు. విష్ణు అధ్యక్షుడిగా మంచిగా చేస్తాడని నమ్ముతున్నాం.. మీ వళ్ల కాకపోతే చెప్పండి తాము చేస్తాం అటూ సంచలన కామెంట్స్ చేశారు ప్రభాకర్.































