కన్నడ సినీ నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రకాష్ రాజ్ అచ్చ మైన తెలుగు సినీ నటుడు ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి, విలన్, తాత పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎన్నో అవార్డులను దక్కించుకున్న ప్రకాష్ రాజ్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ లో భాగంగా ప్రకాష్ రాజ్ తన మొదటి భార్య విడిపోవడానికి కారణాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ తన మొదటి భార్య లలిత కుమారికి కొన్ని విషయాలలో పరస్పర భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వాటి కోసం కోర్టుకు వెళ్ళాము విడిపోయాము. నేను నా భార్యకు విడాకులు ఇచ్చాను కానీ నా పిల్లలు తన తల్లికి విడాకులు ఇవ్వలేదు. నా తల్లి తన కోడలుకు విడాకులు ఇవ్వలేదు కదా..అలా మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకున్నప్పటికీ నాకు మరొక పెళ్లి చేసుకోవాలని ఉంది.ఇదే విషయాన్ని నా కూతురు నా దగ్గర నా చెల్లి తల్లి దగ్గర ప్రస్తావిస్తే అందుకు నా పెద్ద కూతురు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు డాడీ అంటూ ప్రోత్సహించింది.

ఈ క్రమంలోనే తన రెండవ భార్య కుటుంబం దగ్గరికి వెళ్లి నాకు మీ కుటుంబం కావాలి ఈ పెళ్లికి నా కుటుంబ సభ్యులు అందరూ వస్తారు అంటూ పెళ్లికి ఒప్పించాను. ఇప్పటికీ నా పెద్ద భార్య విడాకులు తీసుకున్న తర్వాత తను నాకు భార్యగా కాకుండా మంచి స్నేహితురాలిగా ఉండిపోయింది. రాఖీ పండుగ వచ్చినప్పుడు నా ఇద్దరు కూతుర్లు ఇక్కడికి వచ్చి తమ్ముడికి రాఖీ కట్టి వెళతారు. మేం చెన్నై వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తుంటాము. ఇలా విడాకులు తీసుకున్న నా రెండవ భార్య మొదటి భార్య ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు అంటూ వారి గురించి తెలియజేశారు.

ఇక ప్రకాష్ రాజ్ మొదటి భార్యకి ఇద్దరు కూతుర్లు మాత్రమే కాకుండా ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రకాష్ రాజు కొడుకు గాలిపటం ఎగరేస్తూ కింద పడటం వల్ల తలకు దెబ్బ తగిలి మరణించాడని తన మరణం తనని చాలా కృంగదీసిందని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ తెలియజేశారు.
































