Prakash Raj: ప్రకాష్ రాజ్ ఈమధ్య కాలంలో ఎక్కడ మీడియా సమావేశాలలో పాల్గొంటే అక్కడ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఏ విషయమైనా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంతో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ఇదివరకే ఈయన ఎన్నో మార్లు ఇలాంటి వివాదాలలో చిక్కుకోగా తాజాగా మరోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచారు.

తాజాగా ప్రకాష్ రాజ్ కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొని మీడియా ముందు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా బ్యాన్ చేయాలని ట్రోల్ చేసిన వారిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాని బ్యాన్ చేయాలన్న ఇడియట్స్, బిగాట్స్ ఎవరైతే ఉన్నారో.. ఇప్పుడా సినిమా రూ. 700 కోట్లు వసూలు చేసి దూసుకుపోతోంది.
మోదీ సినిమాకు కనీసం రూ.30 కోట్లు కూడా వసూలు రాబట్టలేకపోయారు. అలాంటివారు కేవలం మొరుగుతారంతే, కరవరు. జస్ట్ సౌండ్ పొల్యూషన్ అని వ్యాఖ్యానించారు. ఇక గత ఏడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తీసిన డైరెక్టర్ తనకు ఆస్కార్ రావాలని అడుగుతున్నారు కానీ తనకు భాస్కర్ అవార్డు కూడా రాదని ఈయన ఎద్దేవా చేశారు.

Prakash Raj: ఇంటర్నేషనల్ జ్యూరీనే ఉమ్మేసింది..
రీసెంట్గా వచ్చినటువంటి చెత్త సినిమాలు ఏదైనా ఉంది అంటే అది ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా అని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ జ్యూరీనే మూవీ మేకర్స్ పై ఉమ్మేసింది. పైగా తనకు ఆస్కార్ నామినేషన్ రాలేదని డైరెక్టర్ అడుగుతున్నారు కానీ ఆయనకు భాస్కర్ అవార్డు కూడా రాదంటూ ఈ సినిమా గురించి కూడా ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ప్రకాష్ రాజు వ్యాఖ్యలపై ది కాశ్మీర్ ఫైల్స్ దర్శక నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
“They needed to ban #Pathaan. It’s going 700Cr. These idiots, who needed to #BanPathaan, didn’t run Modi’s movie for 30Cr. They’re simply barking, they do not chew. Don’t fret. Sound air pollution!” says Actor #PrakashRaj at #MBIFL2023 in #Kerala.#PathaanMovie #BoycottGang pic.twitter.com/CismuRxJ4k
— Hate Detector ???? (@HateDetectors) February 6, 2023



























