Pranitha: తెలుగు చిత్ర పరిశ్రమకు ఏం పిల్లో ఏం పిల్లోడు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకొని తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన నటి ప్రణీత సుభాష్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ బాలీవుడ్ సినిమాలలో కూడా నటించే సందడి చేశారు. ఈమెకు తెలుగులో అత్తారింటికి దారేది సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రణీత కరోనా లాక్డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇక ఈమె వివాహం చేసుకున్న కొన్ని నెలలకే గర్భం దాల్చి ఈ ఏడాది జూన్ నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ఇక తరచూ ప్రణీత సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు. కూతురు జన్మించిన తర్వాత ప్రణీత మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల స్వామివారి సన్నిధిలో తన భర్త కూతురికి గుండు కొట్టించి అనంతరం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

- Pranitha:కూతురితో కలిసి మొదటిసారి స్వామివారిని దర్శించుకున్న ప్రణీత…
ఇక స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్న తర్వాత ఆలయం వెలుపల సందడి చేశారు. సాంప్రదాయ దుస్తులలో ప్రణీత తన భర్త నితిన్ రాజు స్వామి వారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































