Prathyusha : ప్రత్యుష ఒక తెలుగు అమ్మాయి, సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా ఏదిగే క్రమంలో అర్థాంతరంగా జీవితం చాలించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకున్న ప్రత్యుష అసలు సినిమాల్లోకి ఎలా వచ్చిందో ప్రత్యుష తల్లి సరోజినీ దేవి గారు తాజా ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రత్యూష తండ్రి మరణం తరువాత తల్లి సరోజినీ దేవి ప్రత్యూష, ఆమె తమ్ముడిని చదివిస్తూ వారిని పెంచింది.

లయ, ఉదయభాను వీళ్లంతా ఒకేసారి సెలెక్ట్ అయ్యారు…
సరోజినీ దేవి గారు ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తున్న సమయంలో ప్రత్యూష ను ఇంటర్మీడియట్ కోసం హాస్టల్ లో ఉంచారు. ఆ సమయంలో జెమినీ టీవీ లో రాఘవేంద్ర రావు గారు ‘అతిలోక సుందరి’ అని కాంటెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిసి స్నేహితులతో కలిసి సరదాగా ఫోటోలను పంపిందట ప్రత్యూష. తల్లికి చెప్పకుండానే ఫోటోలను పంపిందట. మొత్తం ఇరవై మంది దాకా ఫోటోలను పంపితే ప్రత్యూష మాత్రమే సెలెక్ట్ అయింది. అయితే సరోజినీ దేవి గారికి విషయం తెలిసి వద్దని చదువుకోమని తిట్టారట. కానీ సరోజినీ దేవి గారు స్నేహితులను, అన్నను సలహాలు అడిగితే పంపించు తప్పేముంది అని చెప్పడం తో కాంటెస్ట్ కి పంపగా అక్కడ ఫైనల్ లో ఎనిమిది మంది సెలక్ట్ అవ్వగా అందులో లయ, ఉదయభాను, ప్రత్యూష ఉన్నారట.

మిస్ స్మైలింగ్ ఫేస్ అవార్డు ప్రత్యూష అందుకుందట. ఆ తరువాత సినిమా అవకాశాలు రావడం కెరీర్ బాగా ఉన్న సమయంలోనే అనుమానాస్పదంగా ప్రత్యూష చనిపోయారు. అయితే ఇప్పటికీ ఉదయభాను ఫోన్ చేసి మాట్లాడుతుంటారు అంటూ సరోజినీ దేవి చెప్పారు. తన కూతుర్లా పుట్టినరోజు కు ఫోన్ చేసి పిలిచి మళ్ళీ ఫంక్షన్స్ ముందు రోజు కూడా మీరు రావాల్సిందే అంటూ పిలిచిందట. ఇక లయ కూడా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లే వరకూ ప్రత్యూష కి సంబంధించిన ఏదైనా ప్రోగ్రామ్ పెడితే అందుకు ఖచ్చితంగా హాజరు అయ్యేవారట.































