Prbhudeva: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అయిన ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టారు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభుదేవా మొదట కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత దర్శకుడిగా నటుడిగా కూడా తన సత్తా నిరూపించుకున్నాడు.

ఇలా కెరియర్ పరంగా సక్సెస్ ఫుల్ గా ముందుకి దూసుకుపోతున్న ప్రభుదేవా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవాకి మొదట రమాలత్ అనే ఆమెతో వివాహం జరిగింది . వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుడు విశాల్ 13 ఏళ్ల వయస్సులో ప్రాణాంతక వ్యాధితో మరణించారు. ఆ తరువాత హీరోయిన్ నయనతార ని ప్రేమించి పెళ్లి వరకు వెళ్ళాడు.
నయనతారతో పెళ్లికి మొదటి భార్య రమా వ్యతిరేకించింది. ఆ తరువాత 2011లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. నయనతార, ప్రభుదేవా పెళ్ళి జరుగుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వారి పెళ్ళి రద్దయ్యింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభుదేవా రెండో భార్య తెరమీదకు వచ్చింది.
మొదటి భార్యకి విడాకులు ఇవ్వటం, నయనతారతో పెళ్లి రద్దవటంతో ప్రభుదేవా మానసిక క్షోభకు గురయ్యాడు.

Prbhudeva: మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అదృష్టం…
ఆ సమయంలో ముంబైకి చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హిమానిని వద్ద చికిత్స తీసుకుంటున్న క్రమంలో డాక్టర్ తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారని రూమర్లు వచ్చాయి. అయితే తమ మధ్య సంబంధాన్ని బహిర్గతం చేయలేదు ఈ జంట. అయితే తాజాగా ప్రభుదేవా 50వ పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా అతడికి విషెస్ చేస్తూ ఆమె తొలిసారిగా మీడియా ముందు కనిపించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ‘మీతో మూడేళ్ల ప్రయాణం.. అద్భుతమైన జర్నీ. మీరు ఎంతో జాయ్ ఫుల్ పర్సన్.నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా’అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

































