Preetham Jukalker: ప్రీతమ్ జుకాల్కర్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు. ప్రీతమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఈయన కెరియర్ మొదట్లో సమంత చాలా సపోర్ట్ గా ఉండడమే కాకుండా తనని తన డిజైనర్ గా నియమించుకున్నారు ఇలా సమంత ప్రీతమ్ మధ్య చాలా మంచి స్నేహబంధం ఉంది.

ఇకపోతే సమంత ఒకసారి ప్రీతమ్ ఒడిలో కాళ్లు పెట్టుకొని సోఫాలో సేద తీరుతున్నటువంటి ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటో షేర్ చేసిన వెంటనే డిలీట్ చేశారు. అప్పటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. ఇక చివరికి సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోవడంతో ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడానికి ప్రీతమ్ కారణం అంటూ భారీగా తనని ట్రోల్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన ప్రీతమ్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి నేనే కారణమని భావిస్తున్నారు అయితే అందుకు నేను కారణం కాదని తెలిపారు. ఇక సమంతకు నాకు ఏదో సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి.తను నాకు అక్క లాంటిది అంటూ ఈయన చెప్పుకొచ్చారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రీతమ్ నాగచైతన్య సమంత గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Preetham Jukalker సూసైడ్ చేసుకునేవారు..
సమంత చాలా మంచి అమ్మాయి. కెరియర్ స్టార్టింగ్ లో చాలా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు.సమంత నేను క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి డిలీట్ చేశారు ఆ ఫోటోని తనపై ఎన్నో నిందలు పడేలా చేసిందని ఈయన తెలియచేశారు.సమంతకు నాకు మధ్య ఏదో సంబంధం ఉందంటున్నారు నాకు తనకు మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉందని తెలిపారు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ ఆయన చాలా మంచి వారిని చాలా హంబుల్ పర్సన్ అని ప్రీతమ్ తెలియజేశారు.ఇక వీరిద్దరూ డైవర్స్ తీసుకున్నప్పుడు నా గురించి చాలా తప్పుగా మాట్లాడారు నా స్థానంలో కనుక మరొకరు ఉంటే కచ్చితంగా సూసైడ్ చేసుకునేవారు అంటూ ప్రీతమ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































