Preethi: సీనియర్ విద్యార్థిని వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఆత్మహత్య పాల్పడినటువంటి ప్రీతిని నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇలా సీనియర్ విద్యార్థుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడి మరణించడంతో ఒక్కసారిగా ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్న ప్రీతి వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతుంది. అయితే సీనియర్ వేధింపులు తాళలేక ఈమె అత్యంత ప్రమాదకరమైన ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.ఇలా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఈమెను వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించారు. అయితే మధ్యలోనే పల్స్ పూర్తిగా పడిపోవడంతో వైద్యులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
నిమ్స్ వైద్యులు ఆమెకు ఎక్మో సపోర్ట్ తో చికిత్స అందించారు. ఇక ప్రీతి బ్రెయిన్‌డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. ఇక ఆదివారం ప్రీతి కన్నుమూసింది. ఈ విధంగా ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడుతూ అలసిన ప్రీతి చివరకు కన్నుమూశారు. ఇలా డాక్టర్ కాబోతుందన్న తన కూతురు ఇలా మరణించడంతో ఆమె తల్లిదండ్రుల రోదన వర్ణాతీతం.

Preethi: నిందితులకు శిక్ష పడాల్సిందే…
ఇక ప్రీతి మరణించిందనే వార్త తెలియగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు.
ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇక సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రీతి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అయితే ప్రీతి మరణించడంతో తన చావుకి కారణమైనటువంటి వారికి శిక్ష పడాలని పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టారు.


























