Prem Chopra : సోషల్ మీడియా జమానాలో ఒక వార్త వైరల్ అవ్వడం కామన్. కానీ వైరల్ అవ్వడం కోసం వార్తలు పోస్ట్ చేయడం కూడా కామన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియాలో వెంటనే రావాల్సిందే. అయితే ఈ సోషల్ మీడియాలోనే బ్రతుకుతెరువు చూసుకుంటున్న కొంత మంది ప్రభుద్ధులు మాత్రం సెలబ్రిటీల గురించి చెప్పి మాత్రమే డబ్బు సంపాదించడం లేదు, వారిని చంపేసి కూడా సంపాదిస్తున్నారు. మాట కొంచెం కఠినంగా ఉన్నా ఆది వాస్తవం. బ్రతికుండగానే పలానా వ్యక్తి చనిపోయాడంటూ ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు కొంతమంది. మరీ ముఖ్యంగా సీనియర్ నటులు మీడియా కు దూరమై వారి జీవితంలో బిజీగా ఉన్నవారిని చనిపోయారంటూ ప్రచారం చేస్తున్నారు. చివరికి ఆ వ్యక్తి మళ్ళీ మీడియా వద్దకు వచ్చి నేను బ్రతికే ఉన్నాను అంటూ చెప్పాల్సిన దుస్థితి వచ్చింది.

నేను బ్రతికే ఉన్నాను.. ప్రేమ్ చోప్రా…
బాలీవుడ్ లో సీనియర్ నటుడు విలన్ గా బాగా ఫేమస్ అయిన ప్రేమ్ చోప్రా 380 కి పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా బాగా ఫేమస్ అయిన ప్రేమ్ చోప్రా ఉపకార్ సినిమా ద్వారా విలన్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఆయన నటించిన మొదటి పంజాబీ సినిమాలో హీరోగా చేసిన ప్రేమ్ చోప్రా ఆ తరువాత హీరోగా నటించిన సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక ఆయన మరణించారని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చాలా మంది సినిమా వాళ్ళు ఆందోళన చెంది ఆరా తీశారు. చివరికి ఆయన చాలా చక్కగా ఉన్నారు. ఇక ఈ వార్తలను మీద ఆయన స్పందించారు కూడా.. నేను చనిపోయాను అంటూ ఇలా ఎవరు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మిత్రులంతా ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.

గతంలో నా ఆప్తమిత్రుడు జితేంద్ర కూడా మరణించాడంటూ ఇలాగే అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు. ఇక ఈ చెత్త వాగుడు ఆపండి అంటూ ఫైర్ అయ్యారు. నేను చనిపోయాను అంటూ ఇలా పుకార్లు పుట్టించి, రాక్షసానందం పొందుతున్నారు. దీన్నే శాడిజం అంటారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బాలీవుడ్ లో 380 కి పైగా సినిమాల్లో నటించిన ప్రేమ్ చోప్రా మీద ఇలాంటి వదంతులు ప్రచారం చేయడంతో సినిమా వర్గాలు మండి పడుతున్నాయి. డబ్బు కోసం, వ్యూస్ కోసం ఇలా చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు.


































