Premi Vishwanth:ప్రేమి విశ్వనాథ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తారు. కార్తీకదీపం సీరియల్ లో దీప పాత్రలో నటించినటువంటి ప్రేమి విశ్వనాథ్ అనంతరం వంటలక్కగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈమె కేరళ నటి అయినప్పటికీ ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ పూర్తి కావడంతో ఎంతోమంది ఈమెను చాలా మిస్ అవుతున్నారని చెప్పాలి. అయితే తాజాగా ఈమె స్టార్ మా లో ప్రసారమైన బోనాల జాతర కార్యక్రమంలో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీకదీపం సీరియల్ టీం కూడా పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎవరికి తన గురించి తెలియనటువంటి ఒక సీక్రెట్ బయట పెట్టేశారు. మరి వంటలక్క సీక్రెట్ ఏంటి అనే విషయానికి వస్తే.. ఎవరికి తెలియని సీక్రెట్ టాలెంట్ ఏదైనా ఉంది అంటే తాను ఎక్కువగా నిద్ర పోతానని అదే తన టాలెంట్ అంటూ ఈ సందర్భంగా తన సీక్రెట్ బయట పెట్టారు. తాను నిద్రను బాగా ఇష్టపడతానని ఈమె తెలిపారు.

Premi Vishwanth: బోనాల జాతరలో సందడి చేసిన వంటలక్క…
ఈమె ఇలా చెప్పడంతో వెంటనే డాక్టర్ బాబు నేను అలా దాచుకొని చేసే పనులు ఏవి లేవని చెప్పడంతో వెంటనే దండాలయ్య అనే బ్యాగ్రౌండ్ సాంగ్ ప్లే అవుతుంది దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నవ్వుకుంటారు మొత్తానికి బోనాల జాతర కార్యక్రమంలో మరోసారి డాక్టర్ బాబు వంటలక్కను వేదికపై చూడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.































