Maa Neela Tank: తెలుగు సినీ ప్రేక్షకులకు ముద్దుగుమ్మ ప్రియా ఆనంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గుబాటి రానా కాంబినేషన్ లో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకున్న ప్రియా ఆనంద్ ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

ఆ తర్వాత సిద్ధార్థ్ హీరోగా నటించిన 180 సినిమా, అలాగే హీరో శర్వానంద్ నటించిన కో అంటే కోటి ఇలాంటి సినిమాలు నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఈమె నటనకు అందం అభినయం తోడవడంతో అవకాశాలు వరుసగా వచ్చి పడ్డాయి. అలా మొదటి తెలుగులో నటించిన ఈమె తమిళంలో వరుస అవకాశాలు రావడంతో అక్కడే దాదాపుగా పదేళ్లపాటు సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయింది. కాగా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలో అయ్యే ముందు మా అందరికీ తెలిసిందే.

తమిళంలో అవకాశాలు రావడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయిన తర్వాత ఈ ముద్దుగుమ్మ మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అనే అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అలాగే ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మొత్తానికి ప్రియా ఆనంద్ తెలుగులో మా నీళ్ల ట్యాంక్ అనే ఒక వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ వెబ్ సిరీస్ కు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తోంది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా ఆనంద్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుందట.
పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రియా ఆనంద్..
సీరియస్ లో ప్రియా ఆనంద్ ఒక పల్లెటూరి అమ్మాయిగా చాలా నేచురల్ లుక్ లో కనిపించబోతోంది. అంతేకాకుండా అందులో ఆమె వస్త్రధారణ అన్నీ కూడా తెలుగుదనం ఉట్టిపడే విధంగా కనిపిస్తుంది. అయితే టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ నటించిన ఈ వెబ్ సిరీస్ జులై 15 నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పలు ఇమేజెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ప్రియా ఆనంద్ అచ్చం పల్లెటూరి అమ్మాయి లాగా తన లుక్స్ తో అదరగొడుతుంది.































