Priya Bhavani Shankar: మనం ఏ పని చేసి కష్టపడిన అది కేవలం డబ్బు సంపాదించడానికి అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ బయటకు మాత్రం డబ్బుపై వ్యామోహంతో ఈ పని చేయలేదని కేవలం ప్రజాసేవ కోసమో లేదా తన పరపతి పెంచుకోవడం కోసమో ఇలా పనులు చేస్తున్నామని బయటకు చెప్పిన లోపల మాత్రం డబ్బు కోసమే పనులు చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే.

ఇలా డబ్బు కోసం పని చేసే వాటిలో సినిమాలు కూడా ఒకటి.డబ్బు కోసమే సినిమాలు చేస్తూ పెద్ద ఎత్తున బిజినెస్ లు చేస్తూ ఉంటారు. ఇక నటీనటులు కూడా సినిమాలు చేస్తూ డబ్బును సంపాదిస్తూ ఉంటారు. సినిమాలలోకి వచ్చినవారు పొరపాటున డబ్బు కోసమే ఇండస్ట్రీలోకి వచ్చామని చెబితే అదేదో పెద్ద తప్పు అన్నట్టు భావిస్తారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పడంతో నటి ప్రియా భవాని శంకర్ ను పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు.
ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై కొన్ని మీడియా సంస్థలు నెగిటివ్ గా ప్రచారం చేయడంతో అసహనం వ్యక్తం చేసిన నటి ప్రియా భవాని శంకర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఎక్కువగా డబ్బు సంపాదించడానికి ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పడంలో తప్పేముంది? అందరూ డబ్బు కోసమే పని చేస్తున్నారు ఏం మీరు డబ్బు కోసం కాదా పనిచేస్తున్నది అంటూ ఈమె ప్రశ్నించారు.

Priya Bhavani Shankar: మీరు డబ్బు కోసం పని చేయడం లేదా…
యాక్టర్స్ డబ్బు గురించి మాట్లాడితే ఎందుకని అది ఏదో పెద్ద తప్పుగా భావిస్తారు నేనేదో నా పని చేసుకొని పోతుంటే కొన్ని పేరు మోసిన మీడియా సంస్థలు కూడా ఇది తప్పు అని చిత్రీకరించడం చాలా బాధాకరం. అంటూ ఈమె ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు.బుల్లితెర నటిగా తన ప్రయాణం మొదలు పెట్టిన ప్రియా భవాని శంకర్ అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకునే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈమె తెలుగులో రీసెట్ గా కళ్యాణం కమనీయం అనే సినిమాతో తెలుగు హీరోయిన్ గా డెబ్యూ చేశారు.































