Priyamani: ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ విధంగా ప్రియమణి సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఈమె నటిస్తున్నారు. త్వరలోనే మైదాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియమణికి రిపోర్టర్ నుంచి ఒక ప్రశ్న ఎదురయింది. ఒకవేళ మీరు షారుక్ ఖాన్ తో నటించే అవకాశం వస్తే ఏం చేస్తారనే ప్రశ్న ఎదురయింది.
షారుక్ ఖాన్..
ఒకవేళ తనుకు షారుఖ్ ఖాన్ నుంచి మనం సినిమా చేద్దాం అని ఫోన్ కనుక వస్తే నేను దేనినైనా వదులుకొని సినిమా చేయడానికి వెళ్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియమణికి షారుఖ్ ఖాన్ తో నటించడం అంటే అంత ఇష్టమా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈమెతో ఒక్కసారైనా నటించడానికి షారుఖ్ ఖాన్ ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



























