షాకింగ్.. ప్రియమణికి సవతిపోరు.. ఆమెది అక్రమ సంబంధం అంటున్న ముస్తఫా మొదటి భార్య ..

  0
  1363

  వెండితెర నటిగా పరిచయమై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి ప్రియమణి పలు సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే నటి 2017వ సంవత్సరంలో ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ మే బుల్లి తెర పై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రియమణి,ముస్తఫా వివాహం చెల్లదంటూ ముస్తఫా మొదటి భార్య అయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు.

  ఓ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ముస్తఫా, తన మొదటి భార్య అయేషా ను విడివిడిగా సంప్రదించారు. ఈ క్రమంలోనే ముస్తఫా పై తన మొదటి భార్య న్యాయపోరాటం చేస్తోందని తెలుస్తోంది. ముస్తఫా తన మొదటి భార్య అయేషా అతని పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి చేసుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ముస్తఫా రెండవ పెళ్లి చట్టపరంగా చెల్లదని ఇప్పటికీ ఆయన భార్య స్థానంలో నేను ఉన్నానని ఆరోపణలు చేసింది.

  ఈ విషయంపై ముస్తఫా స్పందిస్తూ.. 2010వ సంవత్సరం నుంచి ఆయేషా నుంచి దూరంగా ఉన్నట్లు తెలిపారు.అదేవిధంగా చట్టపరంగా 2013వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోయి 2017వ సంవత్సరంలో ప్రియమణిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. మొదటి భార్య అయేషాకి ఇద్దరు పిల్లలు ఉండటం చేత వారి పోషణకు అవసరమయ్యే డబ్బులను పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే నాపై లేనిపోని ఆరోపణలు చేసి నా దగ్గర నుంచి మరికొంత డబ్బులు కోసమే ఇలాంటి కుట్రపన్నారని ముస్తఫా తెలిపారు.

  ఈ క్రమంలోనే ముస్తఫా తరపున వాదించిన న్యాయవాది పూర్ణిమ భాటియాను సంప్రదించగా, ప్రియమణి, ముస్తఫాలపై అయేషా చేస్తున్న న్యాయపోరాటం నిజమైనదేనని నిర్ధారించారు. ఈ విధంగా వీరిద్దరికీ మనస్పర్ధలు తలెత్తతున్న నేపథ్యంలో ప్రియమణి మాత్రం గత కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here