Priyanaka jain: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రియాంక జైన్ ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళక ముందు పలు బుల్లి తెర సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈమెకు సీరియల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు. ఇక ఈమె మౌనరాగం సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే సీరియల్ నటుడు శివకుమార్ తో ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ సహజీవనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోకుండా ఇలా సహజీవనం ఎందుకు చేస్తున్నారు అంటూ వీరికి ఓ ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు శివకుమార్ ప్రియాంక ఇద్దరు కూడా సమాధానం చెబుతూ పెళ్లి చేసుకోవాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది ప్రియాంకకు ఘనంగా పెళ్లి చేసుకోవడం చాలా ఇష్టం. ఇలా పెళ్లికి అధిక ఖర్చు అవుతుందని మేము సహజీవనం చేస్తున్నాము అంటూ ఇద్దరూ కూడా వింత సమాధానం చెప్పారు.
పెళ్లికి డబ్బు ఖర్చవుతుంది…
ఈ విధంగా వీరిద్దరూ చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లికి డబ్బు ఖర్చవుతుందని సహజీవనం చేయడం ఏంటి? అసలు ఇదేం రీజన్ సామీ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ వివిధ రకాలుగా ట్రోల్ చేస్తున్నారు.




























