Producer Allu Aravind : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ది డిఫరెంట్ స్టైల్ అనొచ్చు. మామ చిరంజీవి లాగానే వేసే డాన్సుల్లో గ్రేస్ ఉంటుంది ఈ మెగా మేనల్లుడికి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఎవరూ ఊహించని పరిణామం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్, ముందు చిన్నదే అనుకున్నా తర్వాత అది ఎంత పెద్ద ప్రమాదం అనేది అందరికీ అర్థమైంది. ఆ ప్రమాదం తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయాడు. మళ్ళీ కోలుకుని సినిమాల్లో బిజీ అయిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘విరూపాక్షా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సినిమా గురించి మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడారు.

ఆక్సిడెంట్ తరువాత ఏమవుతాడో అనుకున్నాము…
సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ ఆక్సిడెంట్ అయిన వెంటనే విషయం తెలిసీ మొదట నేనే హాస్పిటల్ వెళ్ళింది అంటూ అల్లు అరవింద్ తెలిపారు. హాస్పిటల్ తీసుకెళ్ళాక, ఏమైంది, ఎక్కడ దెబ్బలు తగిలాయి, ఏం సమస్యలు ఎదురావుతాయి, బ్రతుకుతాడో లేదో అన్న విషయాలను చెప్పడానికి డాక్టర్లకు 15 నిమిషాల సమయం పట్టింది.

వాళ్ళు అన్నీ ఎగ్జామిన్ చేసుకోడానికి అంత సేపు ఏం జరుగుతుందా అని బయపడ్డాము. వీడి భవిష్యత్తు ఏంటి అని చాలా కంగారు పడ్డాము. ఆరోజు నుండి నేడు ఫోన్ చేసి నా సినిమా ఈవెంట్ కి రమ్మన్నపుడు చాల హ్యాపీగా ఉంది. నా నిర్మాణంలో సినిమా చేయరా అని అడిగితే ఈ సినిమా అయ్యాక చేస్తా అని చెప్పాడు. సాయి ధరమ్ మళ్ళీ ఇలా బిజీ అయిపోవడం, సినిమాలు చేయడం ఆనందంగా ఉంది అంటూ తెలిపారు.

































