Producer Avula Giri : బాలకృష్ణ ఫోన్ చేసి బూతులు తిట్టాడు…: నిర్మాత ఆవుల గిరి

0
166

Producer Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహా నాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఎదిగిన ఆవుల గిరి కొన్ని కాంబినేషన్స్ ఎలా ఆగిపోయాయో ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

బాలకృష్ణ తిట్టాడు…

నరసింహా నాయుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న ఆవుల గిరి గారు ఆ సినిమాపై అంచనాల కంటే గోపాల్ గారి మీద నమ్మకంతో సినిమా తీసుకున్నానని చెప్పారు. ఆ సినిమా 100 రోజులు ఆడే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని విడుదలకు సిద్ధమైంది. థియేటర్ కావాలని అడగడంతో నరసింహా నాయుడు తీసేసి ఆ సినిమా వేద్దామని అనుకున్నాం. తారక్ మొదటి సినిమా కదా వేయాలని అనుకున్నాం.

అయితే నేను మంచిర్యాలలో ఏదో వేడుకలో ఉంటే బాలకృష్ణ గారు ఫోన్ చేసి బాగా తిట్టారు. దాంతో సినిమాను కొనసాగించాం. కానీ నిన్ను చూడాలని సినిమాకు థియేటర్ ఇస్తామని మాటిచ్చామని పక్కన వేరే థియేటర్ ఇచ్చేలా మరో డిస్ట్రిబ్యూషన్ వాళ్ళతో మాట్లాడాం. అప్పట్లో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ చాలా బాగా పనిచేసుకునేవాళ్ళం. ఇప్పుడు స్వార్థం పెరిగిపోయి నేనే తినాలి అనే భావన ఎక్కువయపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి అంటూ ఆవుల గిరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.