Bunny Vasu: సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో బన్నీ వాసు ఒకరు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ద్వారా పలు సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బన్ని వాసు తాజాగా కోటబొమ్మాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలుసు. ఈ క్రమంలోని మీడియా ప్రతినిధి బన్నీ వాసుని ప్రశ్నిస్తూ ఈ సినిమా చూసిన తర్వాత చదువుకున్నటువంటి వారు రాజకీయ నాయకులు ఏమని అనుకొని ఉంటారని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు బన్నీ వాసు సమాధానం చెబుతూ బాగా చదువుకున్నటువంటి వారు బాగా జీవితంలో సెటిల్ అయినటువంటి వారు రాజకీయాలలోకి రాకపోవడం మంచిదని తెలియజేశారు. ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్న ఆత్మ అభిమానం ఉన్న అలాంటి వారు రాజకీయాలలోకి రావాలని కోరుకోరు. ఆత్మ అభిమానం ఉన్నటువంటి వారు రాజకీయాలలోకి రావద్దని తెలిపారు.
బట్టలిప్పి రోడ్డుపై నిలబడగలగాలి…
రాజకీయాలలోకి రావాలి అనుకునే వారు ఆత్మ అభిమానం సిగ్గు వదిలేస్తేనే మంచిదని అలాగే మీ కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన బాధపడకూడదు అలాగే మీ భార్య కూతుర్ల గురించి ఎలాంటి కామెంట్లు చేసిన పట్టించుకోకుండా బట్టలిప్పి రోడ్డుపై నిలబడగలిగే వారు మాత్రమే రాజకీయాలలోకి రావాలని బన్నీ వాసు కామెంట్లు చేశారు. ఆత్మ అభిమానం ఉన్నటువంటి ఎవరు కూడా రాజకీయాలలోకి రారని ఈయన తెలిపారు
































