Producer C. Kalyan : చాలా ఏళ్ల నుండి సినిమా రంగంలో ఉంటూ సినిమాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు సికే ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలను నిర్మించారు. సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా సి కళ్యాణ్ వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఆయన పలు ఇంటర్వ్యూల్లో సినిమాల గురించి తెర వెనుక సంగతులను చెబుతుంటారు. అటు తెలుగు తమిళ ఇండస్ట్రీ రెండిటిలోనూ సత్సంబంధాలు కలిగిన కళ్యాణ్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చాలా సన్నిహితంగా మెలిగారు. ఇక తెలుగు సినిమా నిర్మాతల మండలిలో ఉన్న అయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండస్ట్రీ గురించి తెలిపారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలోని ట్రాజెడీ సంఘటనము చాలా మందికి తెలియవు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మొదటి భార్య మరణం గురించి తెలిపారు.

బ్రహ్మానందం డబ్బులిచ్చి పంపాడు…
కళ్యాణ్ గారు చెన్నై లోనే ఉన్నా తరచూ షూటింగుడ్ హైదరాబాద్ లో ఉండటం వల్ల ఎక్కువ సార్లు హైదరాబాద్ కు రావాల్సి ఉండేదట. ఆయన, ఆయన తమ్ముడు వాళ్ళ అక్క కూతుర్లనే పెళ్లి చేసుకోవడం వల్ల ఉమ్మడిగా అందరూ చెన్నై లో ఉండేవారట. అయితే ఇరుగుపొరుగు ఏవో గొడవల వల్ల కళ్యాణ్ గారి భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆమె చాలా సెన్సిటీవ్ అవ్వడం వల్ల నేను నా తమ్ముడు హైదరాబాద్ లో ఉన్న సమయంలో అలా చేసింది.

విషయం నాకు నా తమ్ముడికి తెలియగానే ఆ సమయంలో శివ నాగేశ్వరావు డైరెక్షన్ లో బ్రహ్మానందం సీన్ షూటింగ్ జరుగుతోంది. సీన్ అయ్యేవరకు మౌనంగా ఉండి అయిపోగానే నా తమ్ముడు ఏడ్చేసాడు అలా అందరికీ తెలిసింది. వెంటనే ఫ్లైట్ కి చెన్నై కి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేకపోవడంతో బ్రహ్మానందం తన సొంత డబ్బులిచ్చి సహాయం చేసాడు అంటూ చెప్పారు. నా భార్య మరణం నన్ను దాదాపు 17 ఏళ్ల వరకు వెంటాడింది ఆ బాధ మరచిపోడానికి ఎక్కువ పని చేసేవాడిని అంటూ చెప్పారు. ఇక చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము అంటూ తెలిపారు.