Producer DS Rao : దమ్మలపాటి శ్రీనివాస రావు గారు ప్రముఖంగా డిఎస్ రావుగా ప్రసిద్ధి చెందిన ఈయన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా పిల్ల జమిందార్, చమ్మక్ చల్లో, మిస్టర్ నూకయ్య, ద్రోణ వంటి సినిమాలను నిర్మించారు. సురేష్ ప్రోడక్షన్స్ వారితో మంచి అనుబంధం ఉన్న దమ్మలపాటి శ్రీనివాస రావు గారు ప్రస్తుతం సినిమాల నిర్మాణం తగ్గించి నటుడుగా పలు సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణం సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆర్థికంగా తాను దెబ్బతిన్న సందర్భాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విదేశాల నుండి వచ్చి మరీ సినిమా మీద ఇష్టంతో ప్రొడ్యూసర్ అయ్యారు డిఎస్ రావు గారు. మొదట్లో కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్న ఆయన సినిమా నిర్మాణం వల్ల బాగా దెబ్బతిన్నారు.

నా కొడుకు ఇపుడున్న హీరోలకన్నా బాగుంటాడు…
డిఎస్ రావు గారు చిన్న సినిమాలనే ఎక్కువగా నిర్మించి కెరీర్ లో పెద్ధ తప్పు చేసానంటూ చెప్పారు. పిల్ల జమిందార్ వంటి హిట్ తరువాత పెద్ద హీరోలతో ట్రావెల్ అయ్యుంటే కెరీర్ ఇంకోలా ఉండేదని, కాకపోతే అలా చేయకుండా మళ్ళీ చిన్న సినిమాలే చేసానని దాంతో నష్టపోయానంటూ చెప్పారు. ఇక కుటుంబం గురించి మాట్లాడుతూ ఇద్దరు కొడుకులు కాగా పిల్లలు ఇప్పటికీ అడుగుతుంటారు నువ్వు ప్రొడ్యూసర్ గా పెద్ధ హీరోలతో సినిమా చేసుండొచ్చు కదా, నువ్వు చేసిన సినిమాలు ఏవో కూడా తెలియదు అంటుటారు అంటూ చెప్పారు. ఇక పెద్ధ కొడుకు ద్రోణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడని ఆ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చిందంటూ చెప్పారు.

అయితే వాడికి యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రస్ట్ లేదని, అందుకే సినిమా వైపు రాలేదని, చూడ్డానికి ఇపుడున్న హీరోలకన్నా చాలా బాగుంటాడు కానీ వాడికి సినిమా మీద ఇంట్రస్ట్ లేదంటూ చెప్పారు. ఇక చిన్నోడికి 14 సంవత్సరాలు ఇప్పుడు వాడికి ఇంట్రస్ట్ ఉంది చూడాలి వాడు సినిమాల్లోకి వస్తాడేమో అంటూ చెప్పారు. ఇక పెద్ధ హీరోలతో సినిమా చేయాలని ఒకానొక టైంలో అనుకుని అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకున్నా అదే టైంకి ఎవరో ఒక డైరెక్టర్ వచ్చి సినిమా కథ రెడీ, హీరో రెడీ గా ఉన్నాడు చేయడాని అని చెప్తాడు అలా మళ్ళీ డైవర్ట్ అయిపోయింది అంటూ తెలిపారు.