Naga Vamsi: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం డిజే టిల్లు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి పుట్టు మచ్చల గురించి పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మరో వివాదం చోటుచేసుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వైజాగ్ లో ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత నాగవంశీ ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధించడం వల్ల అభిమానులు చాలా హర్ట్ అయినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం ఏ నిర్మాణ సంస్థకైనా ప్రేక్షకులే బలం. మీరు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంలో డిజె టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను.
సోదరులుగా భావించడం వల్లే…
ప్రేక్షకులను సోదరులగా భావించడం వల్లే ఏక వచనంతో సంబోధించి మాట్లాడానని తెలిపారు.ఈ క్రమంలోనే నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేసారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
???? pic.twitter.com/WzjueNtDOw
— Naga Vamsi (@vamsi84) February 18, 2022





























