Producer Natti Kumar : సంక్రాంతి పండగ అంటే సినిమాలకు పండగ. పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా లేకుండా అందరి హీరోల సినిమాలు ఈ పండగ అప్పుడు విడుదల చేసుకోడానికి ప్లాన్ చేస్తారు. అలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా పండగ పూట హడావిడి చేస్తుంటాయి. అయితే ఈ సారి పండగ కు పెద్ద సినిమాలే కాకుండా తమిళం నుండి విజయ్ సినిమా కూడా బరిలో నిలుస్తోంది. ఇక చిన్న చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ విషయంలోనే అసలు నిప్పు రాజుకుంది. ఈ విషయాల గురించి నిర్మాత నట్టి కుమార్ గారు ఆసక్తికర కామెంట్స్ చేసారు.

వాళ్లకే అసలు పవర్…. పెద్ద హీరోలైన ఏమి చేయలేరు….
డబ్బింగ్ సినిమాలకంటే ముందు స్ట్రైట్ సినిమాకే ప్రాధాన్యత ఉండాలంటూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నారు. నిర్మాత దిల్ రాజు మొదట ఈ ప్రతిపాదన తెచ్చారు. ఇప్పుడు మాట మార్చి ఆయన నిర్మించిన డబ్బింగ్ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. సంక్రాంతి తెలుగు ఇండస్ట్రీ కి పెద్ద పండగ సీజన్ ఆ సమయంలో పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయి. అలాంటి సమయంలో దిల్ రాజు తన సినిమా అయిన తమిళ సినిమా వారసుడు విడుదల చేయాలని అనుకోవడం ఎక్కువ థియేటర్లు ఆయన చేతిలో ఉండటం వల్ల వివాదం మొదలయింది. ఇక ఈ విషయం గురించి మాట్లాడితు నిర్మాత నట్టి కుమార్ సంక్రాంతి కి మన సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ మాట్లాడారు.

తెలుగు ప్రేక్షకులు పెద్ద హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను చూడాలని అనుకుంటారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి పెద్ధ హీరోలైన పండగ రోజు వాళ్ళ సినిమా రావడానికి ఏమి చేయలేరు. ఈ విషయంలో థియేటర్ ఎగ్జిక్యూటర్లదే అంతిమ నిర్ణయం. వాళ్ళ ఊరిలో ప్రేక్షకుల డిమాండ్ ను బట్టే సినిమా వేయాల్సి ఉంటుంది. ఆది తెలుగు సినిమానా, తమిళ సినిమాన అన్నది ప్రేక్షకుల అభిప్రాయాల ప్రకారం ఉంటుంది అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.నా థియేటర్లలో నా ఊర్లో అయితే నేను మన తెలుగు హీరోలా సినిమాలకు ప్రాధన్యత ఇస్తాను ఎందుకంటే పండగ పూట మనవాళ్ళు సినిమా చూడాలి మన అభిమాన హీరో సినిమా చూడాలని కోరుకుంటారు కాబట్టి అంటూ అభిప్రాయపడ్డారు . అయితే అంతిమ నిర్ణయం థియేటర్ ఓనర్స్ దే అవుతుంది ఎవరయినా వ్యాపార దృక్పధంతోనే ఆలోచిస్తారు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.































