Producer Natti Kumar : ఈ మధ్య కాలంలో పెద్ధ హీరోల పాత సినిమాలను రీరిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుష్ చేస్తున్నారు. బాలయ్య చెన్నకేశవ రెడ్డి, పవన్ సినిమాలను, మహేష్ బాబు పోకిరి ఇలా హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో చూస్తూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలా ఈసారి మెగా పవర్ రామ్ చరణ్ కెరీర్ లోనే ఫ్లాప్ మూటగట్టుకున్న ‘ఆరంజ్’ సినిమాను మరోసారి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఈ విషయం గురించి నిర్మాత నట్టి కుమార్ మాట్లాడారు.

అపుడు 75 లక్షలు నష్టపోయాను…
ఆరంజ్ సినిమా మొదటి సారి 2010లో విడుదల అయినపుడు సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. సినిమా కథ ఎవరికీ నచ్చలేదు. అపుడు థియేటర్స్ లో విడుదల చేసి దాదాపు 75 లక్షలు నష్టపోయినట్లు నట్టి కూమర్ తెలిపారు. ఫస్ట్ డే మొదటి ఆట అయిపోయాక థియేటర్స్ ఖాళీగా ఐపోయాయని అపుడు ఎవరికీ సినిమా నచ్చలేదని తెలిపారు.

అయితే ఇవుడు మళ్ళీ విడుదల చేస్తే సినిమా యూత్ కి నచ్చుతోందని తెలిపారు. థియేటర్స్ వద్ద అందరూ 15 నుండి 30 మధ్య వాళ్ళే కనిపిస్తున్నారని, ఇప్పటి యూత్ కి సినిమా నచ్చుతోందని వివరించారు. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘దేశ ముదురు’ కూడా విడుదల చేస్తామని అది కూడా మంచి హిట్ అవుతుందని తెలిపారు.


































