Producer Natti Kumar : దగ్గుబాటి ఫ్యామిలీ అనగానే ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం. డాక్టర్ రామానాయుడు గారు ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్నారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కాకుండా రామానాయుడు స్టూడియో కూడా నిర్మించారు. ఇక కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్ లు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. సురేష్ బాబు సినిమా ప్రొడ్యూసర్ గా మారితే వెంకటేష్ హీరోగా టాప్ హీరోస్ లో ఒకరిగా ఉన్నారు. ఇక వాళ్ళ ఇంటి నుండి ఈతరంలో వారసుడిగా వచ్చిన రాణా దగ్గుబాటి రొటీన్ కథలను కాకుండా కమర్షియల్ పంథాలో పోకుండా నటనకు ఆస్కారమున్న సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఎప్పుడూ వివాదాల్లో ఉండని దగ్గుబాటి ఫ్యామిలీ మొదటి సారి వివాదంలో చిక్కుకున్నారు. భూ వివాదంలో ఏకంగా క్రిమినల్ ఫైల్ అయింది. మే 1న కోర్టుకు హాజరవ్వాలంటూ నాంపల్లి కోర్ట్ సమన్లు కూడా జారీ చేసింది. ఇక ఈ విషయం గురించి నిర్మాత నట్టి కుమార్ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

సురేష్ బాబు నుండి ల్యాండ్ కొన్న రాణా…
ఫిలింనగర్లో సురేష్ బాబు తనకున్న ల్యాండ్ ను రాణా పేరిట వెయ్యి గజాల స్థలం రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే ఆ ల్యాండ్ నటి మాధవి పేరిట ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. ఆ ల్యాండ్ ను ఒక వ్యాపార వేత్తకు లీజుకి ఇవ్వగా ప్రస్తుతం లీజు గడువు పూర్తి అయిపోవడంతో ఖాళీ చేయించాలని భావించినా ఖాళీ చేయకపోవడంతో ప్రమోద కుమార్ అనే వ్యాపారి మీద సురేష్ బాబు కేసు వేయించారు. అయితే మరో వైపు ల్యాండ్ ను అమ్మేస్తానని చెప్పి సురేష్ బాబు తన వద్ద 5 కోట్లు తీసుకున్నాడని అయితే రిజిస్ట్రేషన్ మాత్రం చేసి ఇవ్వడం లేదని తీరా చూస్తే కొడుకుకు రాసిచ్చాడని ప్రమోద్ కుమార్ చెప్తున్నారు. ఇక ఈవిషయం గురించి నట్టి కుమార్ మాట్లాడుతూ రాత్రికి రాత్రే అక్కడ గోడ కట్టడం అలాగే రెండొందల మంది బౌన్సర్ లను అక్కడ కాపలా పెట్టడం వరకైతే నాకు తెలుసు కానీ అసలు డిస్ప్యూట్ నాకు క్లియర్ గా తెలియదంటూ చెప్పారు.
సురేష్ బాబు డేంజరస్ మనిషి…

నట్టి కుమార్ మాట్లాడుతూ సురేష్ బాబుతో అంత ఈజీగా ఉండదని, చాలా డేంజరస్ మనిషి అంటూ చెప్పారు. తాను బాగా కమర్షియల్ అని రౌడీలొచ్చినా, పొలిటికల్ వచ్చినా ఎవరినైనా తాను ఎదుర్కొంటాడంటూ చెప్పారు. అయితే డబ్బు తీసుకుని ఒకరిని మోసం మాత్రం చేయరని దగ్గుబాటి ఫ్యామిలీ గురించి బాగా తెలుసంటూ చెప్పారు. వారి విషయంలో ఎవరినీ వేలు పెట్టనివ్వరు ఇంకెవరినీ వాళ్ళు మోసం చేయరు అంటూ చెప్పాడు. ఈ ల్యాండ్ విషయంలో కూడా ఏదో తేడా ఎక్కడో ఉంది కానీ అలా సురేష్ బాబు డబ్బు తీసుకుని మోసం చేయడం లాంటివి చేయరు అంటూ చెప్పారు.































