Producer Suresh Babu : నా డబ్బు నా ఇష్టం.. నువ్వెవరివి చెప్పడానికి అన్నారు…: ప్రొడ్యూసర్ సురేష్ బాబు

0
167

Producer Suresh Babu : మూవీ మొఘల్ రామానాయుడు గారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవచేశారు. సినిమా నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించారు. అలాగే స్టూడియో ద్వారా కూడా ఎన్నో సినిమాలకు సదుపాయలను అందుబాటులో ఉంచారు. ఇక రామానాయుడు గారి కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఇద్దరూ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. సురేష్ బాబు తండ్రి లాగా నిర్మాణ రంగంలో ఉంటూ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇక వెంకటేష్ గారు అగ్ర హీరోగా ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చారు. ఇక సినిమా రంగంలో పెద్ద కుటుంబాల్లో ఒకటిగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయల్లోకి అడుగుపెట్టారు అయితే ప్రస్తుతం క్రియాశీలకంగా లేరు. ఇక ప్రస్తుతం ఉన్న చిత్రసీమ పరిస్థితులను వివరించారు.

నా డబ్బు నా ఇష్టం అన్నారు…

సురేష్ బాబు ప్రస్తుతం పెరుగుతున్న బడ్జెట్ అలాగే పోటీ తత్వం గురించి మాట్లాడుతూ ఓటిటి ప్లాట్ఫామ్ వల్ల థియేటర్లు నష్టపోతున్నాయని అలాగే సినిమాల్లో కూడా నాణ్యతను ప్రేక్షకులు కోరుకుంటున్నారంటూ తెలిపారు. ఇక కొత్తగా వచ్చిన నిర్మాతలు ఎంత డబ్బు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. నిజానికి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగడానికి కారణం టెక్నీషియన్స్ అలాగే ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ బాగా పెరగడమే. ఒకప్పుడు షూటింగ్ లో ఒక కారవన్ కనిపించేది ఇప్పుడు పది దాకా కారవాన్ లు ప్రైవేట్ వెహికల్స్ కనిపిస్తున్నాయి.

ఇక కొత్తగా వచ్చే నిర్మాతలకు నిర్మాతల మండలి తరుపున ఒక చిన్న క్లాస్ తీసుకుని పెట్టుబడి ఎలా పెట్టాలి రిస్క్ ఎలా ఉంటుంది వంటి విషయాలను చెబుతుంటాను. కానీ కొత్తగా నిర్మాత అవ్వాలనుకునే వాళ్ళు అవేవి పట్టించుకోకుండా నా డబ్బు నా ఇష్టం మేం పెడతాం మీకేంటి ముందు సభ్యత్వం ఇవ్వండి అంటారు. నేటి ఇండస్ట్రీలో డబ్బు ఎంత పెడుతున్నా లాభం వస్తుందనే నమ్మకం ఉంది విసిబుల్ ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి అందుకే అందరూ నిర్మాత అనే పేరు వేయించుకోడానికి ఆరాటపడుతున్నారు అంటూ తెలిపారు సురేష్ బాబు.