Actress Gauthami: సీనియర్ హీరోయిన్ గౌతమి గత కొద్ది రోజులుగా భూ కబ్జా విషయంలో తరచూ పోలీస్ స్టేషన్ కి కోర్టుకు వెళుతున్న సంగతి మనకు తెలిసిందే. తనకు చెందిన 25 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలి అంటూ ఈమె కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసు విషయం విచారణకు రావడంతో మరోసారి ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

గౌతమికి శ్రీపెరుంబూర్ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రూ.46 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. తన అనారోగ్యం కారణంగా కొన్ని ఆస్తులను అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా ఈ పనులన్నింటినీ కూడా ఈమె అలగప్పన్ అనే ఏజెంట్‌కు అప్పజెప్పింది. కారైక్కుడికి చెందిన అళగప్పన్ రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి రూ.3 కోట్లు తీసుకొని మోసానికి పాల్పడ్డారు.

ఇక ఈయన ఫోర్జరీ సంతకాల ద్వారా ఆ 25 కోట్ల విలువ చేసే భూమిని కైవసం చేసుకున్నారు అదేంటని ఈమె ప్రశ్నించడంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనని తన కూతురిని చంపేస్తానని బెదిరిస్తున్నట్లు గౌతమి రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇలా తాను రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనని చంపేస్తానని బెదిరించడంతో తన కూతురు చదువుకు కూడా చాలా డిస్టర్బ్ అవుతుందని ఈమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
చంపేస్తామని బెదిరింపులు..
ఇలా గౌతమి ఫిర్యాదు మేరకు పోలీసులు తనని అరెస్టు చేయడంతో అరెస్టు చేశారు ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇలా అళగప్పన్ నప్ అరెస్టు చేయడంతో ఆయన భార్య నాచ్చియార్ తదితరులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నాకు న్యాయం జరిగే వరకూ అళగప్పన్ కి బెయిల్ రాకూడదని గౌతమి తరపు న్యాయవాది వాదించారు. ఇలా ఆస్తి విషయంలో గౌతమి పోరాటం చేస్తూనే ఉన్నారు.



























