Pruthvi : సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం ‘పెళ్లి’ పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసిన పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. ఇక మొదట్లో సినిమా అవకాశాల కోసం కష్టపడుతున్న సమయంలో రఘువరన్ మంచి స్నేహితుడు అంటూ చెప్పారు పృథ్వీ.

రఘువరన్ డ్రగ్స్ అడిక్టర్… చివరి రోజుల్లో అలా అయిపోయాడు…
రఘువరన్, పృథ్వీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో మంచి స్నేహితులుగా ఉండేవారట. ఇద్దరి గర్ల్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అవడం వల్ల ఇంకా క్లోజ్ అయ్యారట. రఘువరన్ తనకు అమ్మాయి గెటప్ చేయాలన్నది నా డ్రీమ్ రోల్ అని చెప్పేవాడంటూ పృథ్వీ చెప్పారు. అయితే సినిమాల్లో బిజీ అయ్యాక ఒక పది, పదహేను ఏళ్ల తరువాత కన్నడ సినిమా కోసం ఇద్దరూ కలిసి పనిచేసినపుడు మాట్లాడితే తనకు ముందు విషయాలు పెద్దగా గుర్తులేవు.

అలా అన్నానా, అలా చెప్పానా అని అడిగేవాడు. తాను డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి చాలా మారిపోయాడు. నేను విలన్ గా ఎందుకు చేస్తున్నాను, ఫాదర్ పత్రలు చేయడమేంటి, వాడు ఎలా ఉన్నాడు వాడు హీరోనా అనే ఒక ఆలోచనలో ఎపుడూ బాధపడుతూ ఉండేవాడు. అలానే డ్రగ్స్ అడిక్టర్ అయిపోయి ముందు విషయాలు చాలా వరకూ మరచిపోయి డిప్రెషన్ లోనే మరణించాడు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు పృథ్వీ.































