PS Mithran: ఈ మధ్యకాలంలో వరుసగా సినిమా సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ సైతం కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.ఈయన గత ఏడాది జూన్ నెలలో ప్రముఖ జర్నలిస్ట్ ఆశమీరా అయ్యప్పన్ అనే జర్నలిస్టుతో నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఇకపోతే తాజాగా తంజావూరు వివాహ వేదికగా ఈయన వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా వీరి వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే హీరో కార్తీ సైతం వీరి పెళ్లికి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విశాల్ హీరోగా తెరకెక్కిన అభిమన్యు సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు పి ఎస్ మిత్రన్. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది ఈ సినిమా తర్వాత నటుడు కార్తీ హీరోగా హీరో అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అనంతరం గత ఏడాది కార్తీ ద్విపాత్రాభినయంలో నటించిన సర్దార్ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

PS Mithran: జర్నలిస్టుతో ఏడడుగులు నచ్చిన డైరెక్టర్…
ఇలా వరుస హిట్ సినిమాలతో కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల జాబితాలో పేరు సంపాదించుకున్నటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఈ క్రమంలోనే ఈయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ఫోటోలు చూసినటువంటి పలువురు నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Congratulations #PSMithran & #AshaMeeraAiyappan on a spectacular wedding and a lifetime of love and happiness ahead ????????????????
From entire team of #StudioGreen #PSMithranMarriage@Psmithran @aashameera pic.twitter.com/3eZcNYLiLN
— Studio Green (@StudioGreen2) February 12, 2023































