Puneeth Raj Kumar Wife: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణ వార్తను ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా నటించిన సినిమా జేమ్స్. ఈ సినిమా ఆయన మరణాంతరం విడుదల కావడం విశేషం. అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఎంతో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

ఇక తన అభిమాన నటుడిని చివరిసారిగా నటించిన సినిమా కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ కి వెళ్లి పునీత్ నటించిన జేమ్స్ సినిమాని చూడటమే కాకుండా ఆయన లేరనే విషయాన్ని తెలుసుకొని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇక పునీత్ నటించిన చివరి సినిమాని తన ఇద్దరు కూతుర్లతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వీక్షించారు.

అయితే పునీత్ జేమ్స్ సినిమాని ఇప్పటి వరకు ఆయన భార్య అశ్విని చూడలేదు. అయితే అశ్విని ఈ సినిమా ఎందుకు చూడలేదనే విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని మాట్లాడుతూ…ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు కానీ ఈ సినిమా నేను చూడలేదు.
ఆయనని బ్రతికించారు….
ఈ సినిమా చూడడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే అందరి మాదిరి ఈ సినిమాని నేను చూడలేకపోవచ్చు అంటూ తెలియజేశారు.ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇందులో యాక్షన్ సన్నివేశాలు గురించి నా దగ్గర ఎన్నో సార్లు చెప్పారు. అలాగే ఈ సినిమా కోసం ఉపయోగించిన టెక్నాలజీ గురించి కూడా తన దగ్గర ఎన్నోసార్లు వివరించారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.పునీత్ నటించిన చివరి సినిమా విడుదలైన తర్వాత ఎంతోమంది అప్పు అభిమానులు నేత్రదానం, రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా అప్పు పై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకొని ఆయనను తిరిగి బ్రతికించారంటూ అశ్విని మరోసారి తన భర్త పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.



























