కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను సినీ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటివరకు యాక్టివ్ గా ఉండి, చలాకీగా ఉన్న అతను ఒక్కసారిగా కుప్పకూలడం, ఆ తర్వాత హాస్పిటల్ కి చేర్పించడం, అనంతరం అతను తుది శ్వాస విడిచడం ఇవన్నీ కూడా టకటక జరిగిపోయాయి. ఇప్పటికీ అతను చనిపోయాడు అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు.

అయితే పునీత్ చనిపోవడానికి రెండు రోజుల ముందు కన్నడ స్టార్ హీరోతో కలిసి స్టేజ్ ఫై స్టెప్పులు కూడా వేశారు. ఇటీవలే కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన జై భజరంగి 2 సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం జరిగింది. ఈవెంట్ కు యష్ అలాగే పునీత్ ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఈ సందర్భంగా పునీత్, శివరాజ్ తోపాటు యష్ తో కలిసి స్టెప్పులు వేశారు. ఇక తాజాగా పునీత్ అకస్మాత్తుగా మరణించడంతో ఇన్ని రోజుల క్రితం యష్ తో కలిసి స్టేజి పై స్టెప్పులు వేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను చూసి అభిమానులు మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ ఎమోషనల్ అవుతున్నారు.
అంతే కాకుండా నిన్న పునీత్ మరణవార్త విన్న అభిమానులు హాస్పిటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ఎమోషనల్ అయ్యారు. కొంతమంది అయితే ఈ మరణ వార్త విని గుండెలవిసేలా రోదించారు. ఒకవైపు పునీత్ కుటుంబంలో, మరొకవైపు శాండల్ వుడ్, అలాగే భారత సినీ పరిశ్రమలో ఇతని మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది.































