దేశంలో రోజురోజుకు క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు బ్యాంక్ ఖాతాలలో డబ్బులు దాచుకుని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎంల ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న మోసాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే దిశగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అడుగులు వేస్తోంది.

దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు ఇకపై నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి డబ్బులు తీసుకోవడం సాధ్యపడదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొంది.

బ్యాంక్ ఈ నిర్ణయం వల్ల మోసపూరిత లావాదేవీలకు సులభంగా చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. కార్డు ఏటీఎంలో పెట్టిన తరువాత ఏటీఎంలో లేకుండా వెంటనే వెనక్కు తీసుకోగలిగే ఏటీఎంలను నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్లని అంటారు. నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్లలో మ్యాగ్నటిక్ స్ట్రిప్ ద్వారా ఏటీఎం మెషీన్ డేటాను తీసుకుంటుంది. ఈ విధంగా కాకుండా పని ఏటీఎం మెషీన్ లోనే కార్డు ఉండే ఏటీఎంలను ఈఎంవీ ఏటీఎం అని చెబుతారు.

ఈఎంవీ ఏటీఎంలలో మెషీన్ కార్డుపై ఉండే చిప్ నుంచి డేటాను తీసుకోవడం ద్వారా ఏటీఎంలు పని చేస్తాయి. భవిష్యత్తులో ఇతర బ్యాంకులు సైతం ఇదే తరహా నిర్ణయాన్ని అమలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.    https://twitter.com/pnbindia/status/1349710359570092038/photo/1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here