అమరావతి: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా, నందమూరి బాలకృష్ణకు ఆయన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చోటుచేసుకున్న హృద్యమైన సన్నివేశం పలువురిని ఆకట్టుకుంది. రాఖీ కట్టిన తర్వాత ఇరువురు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకున్నారు. అనంతరం బాలకృష్ణ తన సోదరి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పురందేశ్వరి భావోద్వేగ సందేశం
ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్న పురందేశ్వరి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తన సందేశంలో ఇలా పేర్కొన్నారు: “ఈ రోజు రక్షాబంధన్ నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్న ప్రత్యేక రోజు. నా తమ్ముడి చేతికి రాఖీ కట్టి, అతని ఆరోగ్యం, ఆనందం, ప్రతి కల నిజం కావాలని హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఈ పవిత్ర క్షణం నా మనసును సంతోషం, ప్రేమతో నింపింది.”
అలాగే, తన సోదరులందరినీ ఉద్దేశిస్తూ, “ప్రియమైన సోదరులారా, మీరు నా జీవితంలో ప్రతి సమయంలో నా కవచంలా, నా నమ్మకమైన తోడుగా, నా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. మీ అందరికీ మంచి ఆరోగ్యం, మీ కలలను నెరవేర్చడానికి శక్తి, ప్రతి అడుగులో విజయాలు లభించాలని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదరీసోదరులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ పురందేశ్వరి తన సందేశాన్ని ముగించారు. ఈ వీడియో నందమూరి అభిమానులను, నెటిజన్‌లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Today is Rakshabandhan, a day close to my heart. I tied a rakhi on my younger brother’s wrist and fill my heart with prayers for his health, happiness, and every dream coming true. Dear brothers, you have been my shield, my confidant, and my best friend in every season of life.… pic.twitter.com/S1yXWI9pzh
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) August 9, 2025





























