Puri Jagannadh Brother: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసి ఇండస్ట్రీకి ఎంతోమంది స్టార్ హీరోలను పరిచయం చేసిన ఘనత పూరి జగన్నాథ్ కు చెల్లుతుందని చెప్పాలి. పూరి జగన్నాథ్ ఇప్పటికే ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు.

ఇక ఈయన ఖాతాలో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయో అలాగే ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.పూరి తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ను మాత్రం ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ కాలేకపోయారనీ చెప్పాలి. అయితే పూరీకి రామ్ శంకర్ మాత్రమే కాకుండా ఇంకో తమ్ముడు కూడా ఉన్నారు.

Puri Jagannadh Brother:ఎమ్మెల్యేగా పూరి తమ్ముడు…
ఈ విషయం చాలా మందికి తెలియదు. పూరి మరో తమ్ముడి పేరు ఉమాశంకర్. ఈయన వైసిపి తరపున నర్సీపట్నం నుండీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన మొదట్లో తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేసినప్పటికీ అనంతరం వైసిపి పార్టీలోకి వచ్చారు.2014లో వైసిపి పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 2019లో బంపర్ మెజారిటీతో గెలుపొందారు.తన తమ్ముడు ఎమ్మెల్యే అయినప్పటికీ ఈయన మాత్రం ఎప్పుడు తన తమ్ముడి పేరు ఉపయోగించుకోలేదు.































