Puri Jagannadh: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి తీసినటువంటి చిత్రం లైగర్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా భారీ బిజినెస్ జరుపుకోగా చివరికి డిజాస్టర్ కావడంతో సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు పెద్ద ఎత్తున పూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు తిరిగి వెనక్కి ఇవ్వడానికి ఒక నెలరోజులు టైం కావాలని అడగగా కొందరు బయర్లు మాత్రం తమకు వెంటనే డబ్బు చెల్లించకపోతే ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇలా తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్చే ప్రయత్నం చేస్తే తాను ఒక్క పైసా కూడా చెల్లించని పూరి జగన్నాథ్ బయ్యర్లకు చెప్పినటువంటి ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అనంతరం పూరి జగన్నాథ్ తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను, ఫైనాన్షియర్ శోభన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వీరి వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని,వారి నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Puri Jagannadh: తన కుటుంబానికి రక్షణ కావాలి…
ఈ విధంగా పూరి జగన్నాథ్ వరంగల్ శీను శోభన్ లపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరి కాస్త ముదిరిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై వరంగల్ శీను, ఫైనాన్షియర్ శోభన్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

































