Puri Jagannath: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను పరిచయం చేసినటువంటి ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరికీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించారు.

అయితే ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ సినిమాలన్నీ కూడా ఆయనకు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు లైగర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన రామ్ పోతినేనితో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూరి తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా యాంకర్ పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తూ మీకు డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉందా అని అడిగారు. ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ సమాధానం చెబుతూ నాకు డ్రగ్స్ తీసుకుని అలవాటు అయితే లేదు కానీ ప్రతిరోజు మందు తాగే అలవాటు ఉందని పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా తెలియజేశారు. తనకు ఇదివరకు ఈ అలవాటు అసలు ఉండేది కాదని తెలిపారు.

Puri Jagannath: మందు తాగనిదే నిద్రపోను…
తన స్నేహితుడు రాంగోపాల్ వర్మ వల్ల తాను మందు తాగే అలవాటు నేర్చుకున్నానని ఈయన తెలిపారు. గత మూడు సంవత్సరాల నుంచి నాకు ఈ అలవాటు వచ్చిందని, ప్రతిరోజు తను మందు తాగనిది నిద్రపోను అంటూ పూరి జగన్నాథ్ తెలిపారు. ఈ ఎదవ అలవాటు మార్చుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న తన వల్ల కావడం లేదు అంటూ పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























