Actor Pradeep: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా, డైరెక్టర్ గా,నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో, బుల్లితెర సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కెరియర్ మొదట్లో పలు టీవీ సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా పలు సినిమాలలో నటించి నటుడిగా విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు.

తాజాగా ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన కెరీర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న ప్రదీప్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఒక నటుడిగా తన జీవితం చాలా సంతృప్తిగా ఉందని వెల్లడించారు. ఇకపోతే ఆయన దర్శకుడిగా నటుడిగా మాత్రమే కాకుండా ట్రైనర్ గా కూడా పనిచేశారు.తనకు అన్నిటికన్నా ముందు ట్రైనర్ గా ఉండటమే ఇష్టం అని ఆ తర్వాత దర్శకత్వం చేయడం ఇష్టం అని తెలిపారు.

అప్పట్లో ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించిన ప్రదీప్ ఏలాంటి ప్రేమలేఖలు రాలేదా అని ప్రశ్నించగా.. బోలెడన్ని ప్రేమ లేఖలు వచ్చాయని,కొంతమంది అమ్మాయిలు ఇది నా రక్తంతో రాస్తున్న లెటర్ అంటూ కూడా తనకు ప్రేమ లేఖలు రాశారని,మరికొందరు తన ఫోటోలు పంపించమని అడుగుతూ లేఖలు రాశారని ప్రదీప్ తెలియజేశారు. ఇక ఇండస్ట్రీ నుంచి ఏ విధమైనటువంటి ప్రేమలేఖలు రాలేదా అని ప్రశ్నించగా ప్రదీప్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరం మంచి స్నేహితులు….
ఇండస్ట్రీ నుంచి నటి పూర్ణిమ దగ్గర నుంచి తనకు ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు.తన తండ్రి కూడా నా తండ్రి దగ్గరకు వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తెలియచేశారు. అయితే మా ఇద్దరి మధ్య కేవలం మంచి స్నేహబంధం మాత్రమే ఉందని, అందుకే తనని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు ఇద్దరం కూడా మనవళ్లు మనవరాళ్లతో సంతోషంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రదీప్ తనకు వచ్చిన ప్రపోజల్స్ గురించి వెల్లడించారు.































