Pushpa 2: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో ప్రస్తుతం చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ట్రైలర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి. ఇలా ఈ సినిమా ట్రైలర్ చూసిన అనంతరం సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.ప్రస్తుతం శరగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోదని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలను 2024 ఏప్రిల్ 7వ తేదీ విడుదల చేయాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే తేదీనే మేకర్స్ సైతం లాక్ చేశారని సమాచారం. ఇలా ఈ సినిమా కోసం మరో ఏడాది పాటు ఎదురు చూడక తప్పదని తెలుస్తోంది.

Pushpa 2: ఈ ఏడాది లేనట్టేనా…
పుష్ప సినిమాతో భారీ అంచనాలను పెంచేసిన అల్లు అర్జున్ ఈ సినిమా పుష్ప సినిమాని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తాజాగా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది త్వరలోనే అధికారకంగా వెల్లడించనున్నారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఈ ఏడాది పార్టీ లేనట్టేనా పుష్ప అంటూ కామెంట్స్ చేస్తున్నారు.































