Pushpa Movie Trolling: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి ప్యాన్ ఇండియా మూవీ పుష్ఫ మిక్స్డ్ టాక్ వచ్చినా.. వసూళ్ల విషయంలో మాత్రం దుమ్ము రేపుతోంది. హిందీ, తమిళ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున వసూళ్లను సాధిస్తోంది.

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ లు సినిమా విడుదలకు ముందే క్రేజ్ ను పెంచాయి. దీనికి తగ్గట్లుగానే సినిమా యూనిట్ ప్రమోషన్లను కూడా నిర్వహించింది. అయితే ప్రస్తుతం అందరి చూపు “పుష్ప: ది రూల్” పై పడింది. పుష్ప 2 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై సుకుమార్ కూడా క్లారిటీ ఇస్తున్నాడు.

ఫిబ్రవరి నుంచి పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభ కావచ్చనే సమాధానం వినిపిస్తుంది. వచ్చే ఏడాది దసరా లేదా క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పుష్ప 1 లో చాలా క్యారెక్టర్లు క్లియర్ గా లేవు. దీంతో రెండో భాగంలో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.
పుష్ప పార్ట్ 2 అవసరమా అంటూ భారీ ట్రోలింగ్..
ముఖ్యంగా అజయ్ క్యారెక్టర్ తో పాటు, పుష్ప తండ్రి ఎవరో తెలియాల్సి ఉంది. దీంతో పాటు మంగళం శ్రీను, ద్రాక్షాయణి క్యారెక్టర్లు పుష్పపై ఎలా పగ తీర్చుకుంటాయి అనేదానితో పాటు విలన్ ఫహాద్ ఫాజిల్, బన్నీ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎక్కువైంది. ఇప్పటికే పుష్ప-1 హిట్ కాలేదని.. పుష్ప -2 తీయడం అవసరమా.. అంటూ ట్రోలింగ్, కామెంట్లు చేస్తున్నారు.































