రాధిక న్యూ లుక్.. నచ్చుతుందని ఆశిస్తున్నానంటూ పోస్ట్!

0
117

అలనాటి సీనియర్ నటి, రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ నటి బుల్లితెరపై తన సత్తా ఏంటో చూపించారు.బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న రాధిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ప్రస్తుతం బుల్లితెరపై రాధిక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా కొంత కాలం పాటు బుల్లితెరకి విరామం చెబుతూ.. కమలహాసన్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన విషయం మనకు తెలిసినదే. దీంతో రాధిక నటిస్తున్న పిన్ని సీరియల్ నుంచి ఈమె తప్పుకున్నారు. ఈమెకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ ఇద్దరికి జైలు శిక్ష పడినట్లు వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన రాధిక తమ గురించి వచ్చే తప్పుడు వార్తలపై హైకోర్టుకు వెళ్తామని, తమపై వచ్చే అవాస్తవాలను నమ్మకండి అంటూ స్పందించారు. తాజాగా హీరోయిన్ తన లుక్ మొత్తం మార్చుకొని సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు.రాధిక తన జుట్టు మొత్తం కత్తిరించుకొని ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ నా కొత్త లుక్ నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here