Racha Ravi: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన జబర్దస్త్ కమెడియన్.. క్లారిటీ ఇచ్చిన రచ్చ రవి…?

0
55

Racha Ravi: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో రచ్చ రవి కూడా ఒకడు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రచ్చ రవి బుల్లితెర మీద ప్రసారం అవుతున్న అనేక టీవీ షోలో సందడి చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకని వెండితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న రచ్చ రవి గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల రచ్చ రవికి రోడ్డు ప్రమాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదం గురించి ఇటీవల రచ్చరవి స్పందించాడు.

తనకి ప్రమాదం జరిగినట్లు వైరల్ అవుతున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు. ఇటీవల సూర్యాపేట నుండి వస్తున్న రచ్చ రవికి మునగాల వద్ద కారు అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల షూటింగ్ కోసం పూణేకి వెళ్ళిన రచ్చ రవి క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకున్నట్లు స్వయంగా వెల్లడించాడు.

Racha Ravi: తాను క్షేమంగా ఉన్నాను…

పూణె నుండి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వచ్చినట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా శనివారం జరగనున్న వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో కూడా పాల్గొనబోతున్నట్లు రచ్చ రవి వెల్లడించాడు. అయితే తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని రచ్చ రవి వెల్లడించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటారని రచ్చ రవి ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా రచ్చ రవి ప్రస్తుతం టీవీ షోలో కన్నా సినిమాలలోనే ఎక్కువగా నటిస్తూ బిజీగా ఉన్నాడు.