Raghavendra Rao:తెలుగు సినిమా ఇండస్ట్రీలో వంద సినిమాలకు పైగా దర్శకత్వం వహించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత రాఘవేంద్రరావు గారికి ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ గా చేయకపోయినా ఈయన దర్శక పర్యవేక్షణలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇకపోతే రాఘవేంద్రరావు గారి ప్రతి ఒక్క సినిమాలలో ఆయన పేరు పక్కన బిఎ అని ఉండడం మనం చూసే ఉంటాము. ఈయన పేరు వెనుక బిఏ అని ఉండడంతో ఆయన చదివిన క్వాలిఫికేషన్ అని ప్రతి ఒక్కరూ భావిస్తారు.కానీ ఈ పేరుకు ఒక సెంటిమెంట్ ఉందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఘవేంద్రరావు గారు ఈ విషయాన్ని వెల్లడించారు.
తాను బిఏ వరకు చదవానని అయితే తాను దర్శకత్వం వహించిన మొదటి రెండు మూడు సినిమాలకు తన పేరు వెనుక బిఏ అని ఉండడంతో ఆ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. ఇకపోతే ఒక సినిమాకు తన పేరు వెనుక బి.ఏ లేకుండా కేవలం రాఘవేంద్రరావు అని ఉండటంతో ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని తెలిపారు.

Raghavendra Rao: డ్రైవర్ గా స్థిరపడే వాణ్ణి…
ఇలా ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి తన పేరు వెనుక తప్పకుండా బిఏ అనేది సెంటిమెంట్ గా భావిస్తూ పెట్టుకుంటున్నానని పేర్కొన్నారు. ఇకపోతే తాను బిఏ చదివి డైరెక్టర్ గా స్థిరపడ్డారని ఒకవేళ డైరెక్టర్ కాకపోయి ఉంటే తాను కచ్చితంగా డ్రైవర్ అయ్యే వాడిని ఈ సందర్భంగా రాఘవేంద్రరావు పేర్కొన్నారు.బిఎ చేసిన కానీ 5000 వరకు మాత్రమే శాలరీ ఇచ్చేవారు. అందుకే తనకి ఎంతో బాగా వచ్చిన డ్రైవింగ్ వృత్తిలో స్థిరపడే వాన్ని అంటూ ఈ సందర్భంగా దర్శకేంద్రుడు వెల్లడించారు.































