నటుడు రాహుల్ దేవ్ ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 1997 లో “దాస్”సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన రాహుల్ సుమారు ఎనభై ఆరు చిత్రాలలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈయన నటించిన సినిమాలలో ఉత్తమ విలన్ పాత్రకు గాను బెస్ట్ ఫిల్మ్ గా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

సినిమా రంగంలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రాహుల్ తెలుగులో కూడా సింహాద్రి సీతయ్య వంటి సినిమాలలో విలక్షణ నటుడుగా నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ విధంగా కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై హిందీ సీరియల్స్ లో నటిస్తూ, బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ గా పాల్గొని బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

సినిమా జీవితంలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రాహుల్ దేవ్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. రాహుల్ దేవ్ రీనా అనే అమ్మాయిని 1998 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించిన తర్వాత రీనా క్యాన్సర్ బారిన పడింది. అయితే తన భార్యను బతికించుకోవడం కోసం రాహుల్ దేవ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆమెకు మెరుగైన చికిత్స కోసం ఎన్నో ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం అందించారు.

ఆమె వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించారు. ఆ సమయంలోనే తన భార్య చికిత్స కోసం సినిమాలలో అవకాశాలు ఇవ్వండి అంటూ ఎంతో మందిని వేడుకున్నారు. ఈ విధంగా రాహుల్ దేవ్ తన భార్యను బతికించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తన భార్యను మృత్యువు వదిలిపెట్టలేదు. క్యాన్సర్ తో పోరాడుతూ 2009వ సంవత్సరంలో ఆమె మరణించారు.

ఆమె మరణానంతరం తన 11 సంవత్సరాల కొడుకు బాగోగులను తాను చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అదే విధంగా తన కొడుకు పై చదువుల కోసం లండన్ లోని తన బంధువుల ఇంటికి పంపించి అక్కడే చదివించారు. ఈ సమయంలో రాహుల్ దేవ్ పలు సినిమాలలో సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన తన భార్య కళ్ళ ముందు ఎంతో వేదనను అనుభవించి మరణించడంతో రాహుల్ దేవ్ మరోసారి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన అయన ఆ తరువాత కొద్దిరోజులుగా నటి, మోడల్ అయిన ముగ్ద గొడ్సె తో డేటింగ్ చేస్తున్నారు.
































