Rahul Ramakrishna: నటుడు రాహుల్ రామకృష్ణ అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ.. అతడు ఇటీవల హిట్ మూవీ జాతి రత్నాలులో ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టితో కలిసి కామెడీని పండించిన వ్యక్తి అంటే అందరికీ గుర్తుకు వస్తుంది. ఇక అతడు తన సినీ కెరీర్ ఎలా ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో అతడు విమర్శలకు గురి అవుతున్నాడు.

సోషల్ మీడియాలో అతడిపై అభిమానులు, నెటిజన్లు విరచుకుపడుతున్నారు. అసలు ఎందుకు ఈ విమర్శలు అనే వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. ఇటీవల అతడు ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఇక తాను 2022 తర్వాత సినిమాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడనని.. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని ట్వీట్ చేశాడు. దీంతో అతడి అభిమానులు అలాంటి నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మరి కొన్ని సినిమాల్లో నటించండి.. మీ కామెడీ హైలెట్ గా ఉంటుంది అంటూ కామెంట్లు చేశారు.
అదే స్థాయిలో కామెంట్లలో కౌంటర్లు
ఇక ఇదిలా ఉండగా.. నిన్న రిటైర్మెంట్ ప్రకటించిన రాహుల్.. మళ్లీ నేడు ఏప్రిల్ ఫూల్ అంటూ షాక్ ఇచ్చాడు. మూర్ఖులారా తాను జోక్ చేశాను. అధిక పారితోషికం, విలాసవంతమైన జీవితాన్ని ఎందుకు వదులుకుంటాను..? నా రిటైర్‌మెంట్ కు సంబంధించి రెండు రోజుల నుంచి చాలామంది.. అభినందింస్తున్నారని.. ఇది నేను నమ్మలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్ తో అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులను ఫూల్స్ అంటూ సంబోధించడం చాలా మందికి కోపం తెప్పించింది. అదే స్థాయిలో కామెంట్లలో కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. రాహుల్ కామెంట్ చదివిన జనాలు.. తిట్టిపోస్తున్నారు. అయితే సాధారణంగా రాహుల్ ఇలాంటి కామెంట్స్ పట్టించుకునే రకం కాదు.. కానీ ఇలా ఫూల్స్ అని సంబోధించడం పెద్ద సాహసమే అని చెప్పాలి.




























