Rahul Sipligunj Pub case : నిన్నటి నుండి సమజిక మధ్యమాలను ఊపిస్తున్న ఇష్యూ రాడిసన్ బ్లూ పబ్ పై పోలీసులా దాడులు సెలబ్రిటీలా పిల్లలు అందులో ఉండటం. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో పూ్ఫింగ్ పబ్ పై పోలీసులు దాడులు చెసారు. సమయానికి మించి పబ్ నడుపుతుండడం తో పోలీసులు పబ్ యాజమాన్యంతో సహా 150మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక డ్రగ్స్ ను కూడా స్వాదినం చేసుకోవడం కొసమెరుపు.

ఇక ఈ పబ్ దాడుల్లో చిక్కిన వారిలో టాలీవుడ్ యంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారిక కొణిదల, గల్లా జయదేవ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే నందిశ్వర్ గౌడ్ కుమారుడు, మాజీ డీజీపీ కూతురు ఇంకా తదితరులు ఉన్నట్లు సమాచారం వచ్చింది.
నేనే తప్పు చేయలేదు…..
అయితే ఈ ఇష్యూ పై ఇపుడిపుడే ఒక్కొక్కరు వివరణ ఇవ్వడం మొదలుపెట్టారు. నిన్న నిహారిక విషయం లో నాగబాబు గారు ఒక వీడియో ను సామజిక మధ్యమాల్లో విడుదల చేసారు. ఇక ఇపుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు.అక్కడ పార్టీ ఉంటేనే నేను వెళ్లాల్సి వచ్చింది.. సమయానికి మించి నిబంధనలకు విరుద్ధంగా పబ్ ను నడిపిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ అడ్డంగా దొరికినట్లుగా నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు నాకు లేదు. నేను ఏ టెస్ట్ కైనా సిద్ధంగా ఉంటాను. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. అలాంటిది నేను ఇలా ఎందుకు చేస్తాను.. అని రాహుల్ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాయవద్దని.. ఆ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా రాహుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.


































