మరి కొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. అయితే కేంద్రం లాక్ డౌన్ నిబంధనల అమలులో భాగంగా దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు టికెట్లను చాలా రోజుల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నారు. మరోవైపు కేంద్రం ఆంక్షలు సడలించినా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పరిమిత సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయి.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నా టికెట్ ఛార్జీలను భారీగా పెంచడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు చూడటమే మానేశాయి. అయితే సామాన్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్ కావడంతో 200 ప్రత్యేక రైళ్లను నడపటానికి సిద్ధమవుతోంది. పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి.

రైల్వే బోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ ఇప్పటికే ప్రత్యేక రైళ్లకు సంబంధించి జోన్ల ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. రైళ్లు నడిపే నమోదవుతున్న కేసులను ఏయే రూట్లలో రైళ్లను నడపాలనే విషయం గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రత్యేక రైళ్లను ఈ నెల 15 నుంచి రైల్వే శాఖ నడిపే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల సూచనల మేరకు రైళ్లను నడిపే విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలలో, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైళ్లను రైల్వే శాఖ నడపనుందని తెలుస్తోంది. పండగ సమయంలో రైల్వే శాఖ తీపికబురు చెప్పడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైతే రైళ్ల సంఖ్యను మరింత పెంచాలని కీలక సూచనలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here