Raj Tarun -Lavanya: సినీ నటుడు రాజు తరుణ్ లావణ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. లావణ్య రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని తనకు అబార్షన్స్ చేయించడమే కాకుండా తనని మోసం చేసి ఇప్పుడు మరొక హీరోయిన్ తో తిరుగుతున్నారు అంటూ ఈమె గత కొద్దిరోజులుగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఈ వివాదం ఇటీవల కాలంలో మరింత ముదిరిపోయింది. ఇక ఈ విషయంపై రాజు తరుణ్ పెద్దగా స్పందించకపోయిన ఆయన తరపున శేఖర్ భాష అనే వ్యక్తి ఏకంగా లైవ్ డిబేట్లోకి వచ్చారు. ఇలా ఒక న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ భాగంగా రాజ్ తరుణ్ గురించి లావణ్య ఆరోపణలు చేశారు అంతేకాకుండా శేఖర్ భాషా సైతం లావణ్య పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
లావణ్య డబ్బు మనిషి అని డబ్బు కోసమే తనని వేధిస్తోందని మాట్లాడారు అంతేకాకుండా చిన్న పిల్లలకు డ్రగ్స్ ఇస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తుందంటూ శేఖర్ బాషా లావణ్య గురించి మాట్లాడటంతో ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా లైవ్ లోనే చెప్పు తీసుకొని ఒక్కసారిగా తనపై దాడి చేసింది.
చిన్నపిల్లలకు డ్రగ్…
ఈ విధంగా లావణ్య శేఖర్ భాష పై చెప్పుతో దాడి చేయడంతో ఆయన కూడా ఒక్కసారిగా తనపై విరుచుకుపడ్డారు అయితే అప్పటికే అక్కడ ఉన్నటువంటి వారు వీరిద్దరిని ఆపే ప్రయత్నం చేశారు ఏది ఏమైనా ఈ విధంగా వీరిద్దరూ లైవ్ డిబేట్ లో కొట్టుకోవడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
































