YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఏ మాత్రం విశ్రాంతి లేకుండా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఎంతో బిజీ అయ్యారు. ఎన్నికల కూడా ఎంతో ప్రశాంతంగా జరిగాయి ఎక్కడా కూడా రీ పోలింగ్ కి అవకాశం లేకుండా ఎన్నికలు పూర్తి అయ్యాయి.

ఇక ఈసారి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాని విధంగా ఏపీలో పోలింగ్ శాతం నమోదు అయ్యింది. అయితే పోలింగ్ శాతం అధికంగా కావడంతో మరోసారి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడానికే సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇకపోతే రాష్ట్ర పరిపాలన కోసం రాష్ట్ర ప్రజల క్షేమం కోసం గత 41 రోజులుగా తాడేపల్లి నివాసంలో జగన్మోహన్ రెడ్డి రాజా శ్యామల చండీయాగం చేయించారు. నిన్నటితో ఈ యాగం పూర్తి అయింది.
జగన్ క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాలను ఎంతగానో ఆచరిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ చండీయాగం 41వ రోజు పూర్తి అవుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఈ యాగంలో పాల్గొన్నారు. వేద పండితులు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి తిరిగి అధికారం తనదేనని తెలియజేశారు.
విదేశీ పర్యటనలలో జగన్..
ఇలా రాజా శ్యామల చండీయాగం పూర్తి చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడం కోసమే ఈ చండీయాగం చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ చండీయాగం పూర్తి కావడంతో జగన్మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో కలిసి ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశీ పర్యటనలకు వెళుతున్న సంగతి తెలిసిందే.




























