జాతీయ జెండాను ఎగురవేసి ర్యాలీని నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తం అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం బాధాకరమన్నారు. కేసీఆర్ పాలనలో జాతీయ జెండా ఎగురవేస్తే కేసులు పెడతాం, రౌడీషీట్లు తెరుస్తాం అని పోలీసులు బెదిరించడం సిగ్గుచేటని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ప్రతి ఏడాది గోషామహల్ నియోజకవర్గంలో ఆగస్టు 15న చిన్నపాటి ర్యాలీ తీస్తామని రాజాసింగ్ అన్నారు. జాతీయ పతాకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుందని చెప్పారు. రెండేళ్ల క్రితం ర్యాలీ తీసినందుకు ట్రాఫిక్ జామ్ అయిందనే సాకుతో కొందరిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ సారి కూడా అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారని వెల్లడించారు.



































